‘ఎవడు’ సూపర్ హిట్

Ram-Charan

జూలై 25 ‘ఎవడు’ & ఆగష్టు 7 ‘అత్తారిం టికీ దారేది?’, ఇలా రెండు/మూడు వారాల గ్యాప్ లో రెండు మెగా సినిమాలు అంటే చాలా ఆనందంగా వుంది కాని, బాద ఏమిటంటే ఈ రెండు సినిమాల పబ్లిసిటి మొదలవ్వలేదు. ఈ రెండు సినిమాలతో పాటు, మరో నెలలో మరో మెగా సినిమా ‘జంజీర్’ అంటే అసలు నమ్మబుద్ది కావడం లేదు. ఏ సినిమా గురించి ఆలోచించాలో అసలు అర్దం కావడం లేదు.

‘ఎవడు’ సూపర్ హిట్ అవుతుందా?
ఆడియో ఫంక్షన్ లో దర్శక నిర్మాతలతో పాటు చిరంజీవి కూడా ‘మగధీర’ కు ధీటుగా వుంటుందని తెగ పొగిడేశారు. ఏ ఉద్దేశంతో మగధీరతో పోల్చేరో మనకు తెలియాలంటే సినిమా రావల్సిందే. రామ్ చరణ్ చేసిన ఐదు సినిమాలలో నాలుగు కమర్షియల్ హిట్స్. ఎవడు కూడా వాటి పక్కన చేరే అవకాశం వుంది.

కంప్లీట్ మాస్ అల్భం కాకపోవడం తో ఫస్ట్ టైమ్ విన్నప్పుడు అంతగా ఎక్కలేదు కాని, రెండు మూడు సార్లు విన్నాక

ఒకటి యువతకు నచ్చే సాంగ్
రెండు మాస్ ను ఉర్రూతలూగించే సాంగ్స్
ఒక క్లాస్ సాంగ్
రెండు వైరటీ సాంగ్స్ తో ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాటలను చిరంజీవి మాదిరి రామ్ చరణ్ తన డాన్స్ తో ఎక్కడికో తీసుకొని వెళ్ళగలడు. ‘ఎవడు’ సూపర్ హిట్ గ్యారంటీ.

Filed Under: Mega FamilyFeatured