రామ్ చరణ్ ‘ఎవడు’ లో అన్నీ కొత్త సాంగ్సే

yevadu

రాజమౌళితో చేసిన ‘మగధీర’లో ‘బంగారు కోడిపెట్ట’ పాట రీమిక్స్ చేస్తే అది పెద్ద హిట్టయ్యింది.

‘రచ్చ’లో ‘వానా వానా వెల్లువాయె’ అంటూ రామ్‌చరణ్, తమన్నా చేసిన డాన్స్ కు అభిమానులు నీరాజనాలు పట్టారు.

రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన నాయక్ లో ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో’ రీమిక్స్ సాంగ్ కూడా ఆ సినిమా విజయంలో ఒకటిగా నిలిచింది.

“రామ్ చరణ్ కు తన తండ్రి హిట్ సాంగ్స్ రీమిక్స్ చేయటం సెంటిమెంట్ గా మారి, ప్రస్తుతం రామ్‌చరణ్ చేస్తున్న ‘ఎవడు’ సినిమా కోసం ‘రౌడీ అల్లుడు’లో చిరంజీవి, నృత్యతార శాంతిపై తీసిన ‘బోలో బోలో బోలో రాణి ప్యార్ చాహియే’ పాటను ‘ఎవడు’ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నట్టుగా” చాలా వెబ్ సైట్స్ ఆశీంచాయి.

ఆ న్యూస్ నిజమైతే బాగుండునని అనిపించింది కాని, ఆ పాట చెయ్యడం లేదని, అన్నీ కొత్త సాంగ్సే అని మ్యూజిక్ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేసాడు.

Filed Under: Mega FamilyFeatured