సెప్టెంబర్ 6న ‘జంజీర్’

Zanjeer

రామ్ చరణ్ ను హిందీ హీరోగా పరిచయం చేస్తూ అపూర్వ లఖియా దర్శకత్వంలో అమిత్ మెహ్రా ‘జంజీర్’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే అమిత్ సోదరులు కోర్టుకెక్కడంతో వేసవిలో రిలీజ్ కావాల్సిన సినిమా ఆగిపోయింది. ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్ని అధిగమించి, సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

అలాగే హిందీ వెర్షన్‌తో పాటు తెలుగు వెర్షన్ ‘తుఫాన్’ను కూడా అదే రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ జోడీగా ప్రియాంకా చోప్రా నటించగా సంజయ్‌దత్ (తెలుగులో శ్రీహరి), ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

జూలైలో ఎవడు .. సెప్టెంబర్ లో జంజీర్ .. ఆగష్టులో పవర్ స్టార్ ‘అత్తారింటికి దారేది?’. గ్యాప్ లేకుండా మూడు సినిమాలు అంటే మెగా అభిమానులకు 2013 బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చు.

ఎవడు & ‘అత్తారింటికి దారేది?’ రిలీజ్ డేట్స్ కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేసేస్తే బాగుంటుంది

Filed Under: Mega FamilyFeatured